సన్నజాజులు
కోపాన్ని గుర్తు చేసే ఎరుపు రంగు గులాబీలు కావు సన్నజాజులు
మోహాన్ని తప్ప మరింకే భావాన్నీ కలిగించని మల్లెలు కావు సన్నజాజులు
మౌనం లోనే శతకోటి భావాలను కలిగించే గీతాలు సన్నజాజులు
చిరకాల మౌనాన్ని ఛేధిస్తూ పెల్లుబికి వచ్చే భావాలు నా ఈ సన్నజాజులు
నా సన్నజాజులు దేవుడి ముందర ప్రమిదలు
నా సన్నజాజులు సంక్రాంతి ముగ్గుల లోని గొబ్బెమ్మలు
శాంతమూర్తి భూదేవి కళ్ళళ్ళోని ఎరుపు జీరలు నా సన్నజాజులు
పాపికొండల మధ్యనుంచి మంద్రంగా సాగిపోయే నీటి ప్రవాహాలు నా సన్నజాజులు
ఆలోచనల తీగలను మీటి ఆవేశ రాగాలను పలికించేవి నా సన్నజాజులు
నా సన్నజాజులు తిలక్ గారి అక్షరాల్లా "వెన్నెల్లో ఆడుకొనే అందమయిన ఆడపిల్లలు."
సీతమ్మ శాంతితత్వం, సత్యభామ జడ విసురు కలిస్తే నా సన్నజాజులు
సంప్రదాయపు ముగ్ధత్వం, ఆధునికత చిలిపిదనం కలిస్తే నా సన్నజాజులు
చంటిపిల్ల చూపులు, బోసి అవ్వ నవ్వులు కలిస్తే నా సన్నజాజులు
ఆడపిల్ల ఆత్మగౌరవానికి ఆలంబనలు నా ఈ సన్నజాజులు
Welcome to Sannajaajulu........